Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్..ఏపీకి భారీ వర్ష సూచన

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్..ఏపీకి భారీ వర్ష సూచన
x
Highlights

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అయితే నెమ్మదిగా బలం పెంచుకుంటోంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో...

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అయితే నెమ్మదిగా బలం పెంచుకుంటోంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం..పశ్చిమ, వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ఇది డిసెంబర్ 11న శ్రీలంక, తమిళనాడు తీరాలను తాకుతుందని ఐఎండీ తెలిపింది. దీంతో నేడు,రేపు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా ప్రాంతాల్లో వర్షం కురవకపోయినా..మేఘాలు నిండి ఉంటాయని తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో నేడు మేఘాలు కమ్ముకుని ఉంటాయి. తూర్పు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవశాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుంది. ఏపీలో గంటకు 15, తెలంగాణలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

ఏపీలో టూవీలర్లపై ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. నేడు తెలంగాణలో వర్షం కురిసే అవకాశం లేదు. ఏపీలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో వాతావరణం తేమగా ఉంటుందని తెలిపింది. రాయలసీమలో మోస్తరు వర్ష సూచన కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories