అనంతపురం జిల్లాలో మరోసారి భారీ వర్షం

అనంతపురం జిల్లాలో మరోసారి భారీ వర్షం
x
Highlights

అనంతపురం జిల్లాలో మరోసారి భారీ వర్షం అనంతపురం జిల్లాలో మరోసారి భారీ వర్షం

అనంతపురం జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. జిల్లాలోని తాడిపత్రి, గుత్తిలను భారీ వర్షం ముంచెత్తింది. వర్షం కారణంగా తాడిపత్రిలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. గత నెల కూడా ఇదే ప్రాంతాన్ని వరద ముంచెత్తింది. వర్షానికి కొన్ని చోట్ల దారులు కనపడక పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కాలనీల్లోని ఇ‍ళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఉప్పు వంక ఉధృతంగా ప్రవహిస్తోంది.

దీంతో గుత్తి- ఆదోని మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే కంబదురు మండలం కొత్తపల్లి వద్ద వంతెన కూలి రాకపోకలకు అంతరాయం కలిగింది. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి చెరువుకు గండిపడటంతో పెద్ద మొత్తంలో నీరు పంటపొలాల్లోకి వృధాగా పోతుంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి, గుత్తి లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి, వెంకటరామిరెడ్డి పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories