Hindupuram: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వద్ద పెన్నా ఉగ్రరూపం

Hindupuram: పలుచోట్ల కొట్టుకుపోయిన రోడ్లు, వాహనాల రాకపోకలకు అంతరాయం

Rama Rao
Published on: 19 May 2022 10:31 AM IST
Heavy Floods to The Penna River in AP | AP News Today
X

 శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వద్ద పెన్నా ఉగ్రరూపం

Hindupuram: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా నదికి వరద పోటెత్తింది. రాత్రి నుంచి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వద్ద పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహానికి పలు చోట్ల రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక కర్ణాటకలోని కడగత్తురు నుంచి హిందూపురం వచ్చే రహదారిపై పోచనపల్లి వద్ద వంతెన పాక్షికంగా కూలిపోయింది. రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే కొట్నూరు చెరువు నిండి పేరురు డ్యామ్‎లోకి వెళ్లనున్నాయి. ఇక జిల్లాలోని విడపనకల్లు, ఉరవకొండ మండలాల్లోని ఉండబండ, డోనేకల్లు వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ రూట్లో తెల్లవారుజాము నుంచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Rama Rao

Rama Rao

Next Story