శ్రీశైలం జలాశయానికి మళ్లీ మళ్ళీ వరద నీరు

శ్రీశైలం జలాశయానికి మళ్లీ మళ్ళీ వరద నీరు
x
Highlights

శ్రీశైలం జలాశయానికి మళ్లీ మళ్ళీ వరద నీరు వస్తోంది. దీంతో ఈ నెలలో రెండుసార్లు గేట్లను ఎత్తారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా...

శ్రీశైలం జలాశయానికి మళ్లీ మళ్ళీ వరద నీరు వస్తోంది. దీంతో ఈ నెలలో రెండుసార్లు గేట్లను ఎత్తారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 884.50అడుగులుగా ఉంది. నీటినిల్వ 215.8070 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రం 7గంటలకు 212.9198 టీఎంసీలుగా ఉంది. ఇటు జూరాల నుంచి 2.60లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 43,790క్యూసెక్కులు కలిపి జలాశయానికి 3,04,365 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం డ్యాం నుంచి సాగర్‌కు వస్తున్న ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో మరోసారి డ్యామ్‌ 26 క్రస్ట్ గేట్లు తెరిచారు. నాగార్జున సాగర్‌ నుంచి అవుట్‌ఫ్లో పెరగడంతో ఆ నీరంతా పులిచింతల ప్రాజెక్టుకు పోటెత్తుతోంది.. వరద పోటుతో పులిచింతల దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. శుక్రవారం సాయంత్రం నాటికి 174.7 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. 3.71 లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.. పదిగేట్ల ద్వారా 3.28 లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories