చంద్రబాబు ఇంటికి ప్రమాద హెచ్చరికలు

చంద్రబాబు ఇంటికి ప్రమాద హెచ్చరికలు
x
Highlights

గత నలభైరోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పోటెత్తుతోంది. ఇప్పటికే జూరాల , శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్, పులిచింతల..

గత నలభైరోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పోటెత్తుతోంది. ఇప్పటికే జూరాల , శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు లు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. గంట గంటకు నీటిమట్టం పెరగడంతో దీంతో ఈస్ట్రన్, వెస్ట్రన్ కెనాల్స్‌కు 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 16.2 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 6.66 లక్షలు క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో నదీపరివాహాక

ప్రాం‍తాల్లో ఉన్న నివాసాలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. వరద ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని భావించిన అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు ఇంటితో సహా 36 భవనాలకు అధికారులు హెచ్చరికలు చేశారు. ఇదిలావుంటే వరద ముంపు ప్రభావిత ప్రాంతాలు అయిన తారకరామనగర్, కృష్ణలంక, భూపేష్ గుప్తానగర్‌లో ఇళ్లు నీట మునిగాయి. దీంతో వీరికోసం విజయవాడ నగరంలో నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారిని అక్కడికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories