Chandrababu: చంద్రబాబు ఆరోగ్యంపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ

Hearing on the Petition filed on Chandrababu Health Today
x

Chandrababu: చంద్రబాబు ఆరోగ్యంపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ

Highlights

Chandrababu: ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునేందుకు చంద్రబాబును.. వర్చువల్‌ విధానంలో హాజరుపర్చాలని జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశం

Chandrababu: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వటం లేదని పిటిషన్‌లో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఆందోళన ఉందంటూ పిటిషన్లలో న్యాయవాదులు ప్రస్తావించారు. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని పిటిషన్‌లో న్యాయవాదులు పేర్కొన్నారు.

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఆయనను ఆన్‌లైన్‌ ద్వారా ఈరోజు తమ ముందు హాజరుపరచాలని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులను విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది. అలాగే మెడికల్ రిపోర్ట్‌ కాపీని చంద్రబాబుకు అందజేయాలని తెలిపింది. చంద్రబాబును పరిశీలించిన వైద్య బృందం ఈనెల 14న ఇచ్చిన ఆరోగ్య నివేదికను తమకు ఇవ్వడానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారని..అవి పొందాలంటే కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలంటున్నారని పేర్కొంటూ చంద్రబాబు లాయర్లు సోమవారం అత్యవసరంగా ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేశారు.

చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన మెడికల్‌ రిపోర్ట్‌ని లిఖిత పూర్వకంగా అడిగినా జైలు అధికారులు ఇవ్వకుండా, కేవలం అరకొర సమాచారంతో హెల్త్‌బులెటిన్‌ మాత్రమే విడుదల చేస్తున్నారని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు జైలు అధికారులు విడుదల చేస్తున్న బులెటిన్‌లలో చంద్రబాబు షుగర్‌ లెవెల్స్‌ గురించి ప్రస్తావించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్‌ బులెటిన్‌ సమగ్రంగా లేకపోవడంతో పాటుగా తాము కోరినా వైద్య నివేదికను ఇవ్వకపోవడంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories