Chandrababu: సుప్రీంకోర్టులో ఇవాళ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ

Hearing on Chandrababu Quash Petition today in the Supreme Court
x

Chandrababu: సుప్రీంకోర్టులో ఇవాళ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ

Highlights

Chandrababu: కోర్టు నెం.3లో ఐటమ్‌ నెం.61గా లిస్ట్ అయిన చంద్రబాబు కేసు

Chandrababu: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో తనపై నమోదైన సీఐడీ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ పిటిషన్ విచారణపై సుప్రీంకోర్టు నుంచి క్లారిటీ వచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టి ఆధ్వర్యంలోని ధర్మాసనం చంద్రబాబు పిటిషన్ ను విచారించనుంది. కోర్టు నెంబర్ 3లో ఐటెమ్ నెంబర్ 61గా చంద్రబాబు కేసు లిస్ట్ అయ్యింది. ఇవాళ మధ్యాహ్నం ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును... చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దర్యాఫ్తు తుది దశలో జోక్యం చేసుకోలేము అంటూ గత శుక్రవారం క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. సెక్షన్ 482 కింద దాఖలైన పిటిషన్ ను మినీ ట్రయల్ నిర్వహించలేమని పేర్కొంది. 17-ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదని వెల్లడించింది.

అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు తన అరెస్ట్ చెల్లదని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అరెస్ట్ చేశారని, హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. 17-ఏను పట్టించుకోకుండా తన అరెస్ట్ జరిగిందని, ఎఫ్ఐఆర్ కానీ దర్యాఫ్తు కానీ చెల్లవని తెలిపారు. దీంతో 17ఏ పైనే ప్రధానంగా సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏ అంశాలను అయితే హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదో వాటిని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా సుప్రీంకోర్టులో ధర్మాసనం ముందు ప్రస్తావించబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories