Shivaratri Brahmotsavalu: మూడోరోజున హంసవాహనంపై దర్శనమిచ్చిన భ్రమరాంబ సమేత శ్రీమల్లికార్జునస్వామి

Hamsvahan Seva In Third Day MahaShivaratri Brahmotsavalu
x

Shivaratri Brahmotsavalu: మూడోరోజున హంసవాహనంపై దర్శనమిచ్చిన భ్రమరాంబ సమేత శ్రీమల్లికార్జునస్వామి

Highlights

Shivaratri Brahmotsavalu: విద్యుత్ దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతున్న ఆలయం

Shivaratri Brahmotsavalu: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. మూడోరోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జునస్వామివారు హంస వాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో హంసవాహనంలో ఆవహింపజేశారు అర్చకస్వాములు. వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులు గ్రామోత్సవానికి తరలివెళ్లారు. రాజగోపురం గుండా హంసవాహనాదీశులైన శ్రీస్వామి, అమ్మవార్లను భాజాభజంత్రీల నడుమ శ్రీశైలం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. హంసవాహనంపై స్వామి, అమ్మవార్లు విహరిస్తుండగా అధిక సంఖ్యలో భక్తులు కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories