APPSC: గ్రూప్-2 పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల..డౌన్ లోడ్ చేసుకోండిలా

Hall tickets released for Group-2 exams download now
x

APPSC: గ్రూప్-2 పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల..డౌన్ లోడ్ చేసుకోండిలా

Highlights

APPSC: గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అల్టర్. ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్...

APPSC: గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అల్టర్. ఈ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష రెండు సెక్షన్లలో ఉంటుంది. ఈ పరీక్ష రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఉంటుంది. అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా పలు విభాగాల్లో ఆఫీసర్, అసిస్టెంట్, డిప్యూటీ కలెక్టర్ వంటి పదవులను పొందవచ్చును. ఏపీపీఎస్సీ ఈనెల 23న నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను రిలీజ్ చేసింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పరీక్షకు సంబంధించి మొదటిసెషన్ ఉదయం 10 గంటల నుంచి 12.30గంటల వరకు ఉంటుంది. రెండవ సెషన్ మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరుగుతుంది. అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే వారు పరీక్ష కేంద్రాలకు హాల్ టికెట్లు తీసుకురావడం కూడా తప్పనిసరి. హాల్ టికెట్ లేకుండా అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశం పొందలేరు. హాల్ టికెట్ తోపాటు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర పత్రాలు తీసుకువెళ్లాలి. ఇతర వస్తువులు, పరికరాలు పరీక్ష కేంద్రాలకు తీసుకురాకూడదు. ఈ వస్తువులు పరీక్ష సమయంలో ద్రుష్టిలో పెట్టుకోకుండా తీసుకురావడం కట్టుబడి నియమాలకు వ్యతిరేకంగా ఉంటుంది.

హాల్ టికెట్ ను ఈ విధంగా డౌన్ లోడ్ చేసుకోండి. ముందుగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో (https://psc.ap.gov.in) వెళ్లండి. హాల్ టికెట్లు అనే లింక్ పై క్లిక్ చేయాలి. అభ్యర్థి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్ ను ప్రింట్ తీసుకుని పరీక్ష కేంద్రానికి తీసుకురావడం తప్పనిసరి.

Show Full Article
Print Article
Next Story
More Stories