Top
logo

ఆయన ఒకే అంటే నేను మాట్లాడతా : జీవీఎల్

ఆయన ఒకే అంటే నేను మాట్లాడతా : జీవీఎల్
Highlights

ఆయన ఒకే అంటే నేను మాట్లాడతా : జీవీఎల్ ఆయన ఒకే అంటే నేను మాట్లాడతా : జీవీఎల్

శనివారం విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొన జీవీఎల్‌ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు. తెలుగుదేశం పార్టీనుంచి పది మంది నాయకులు బీజేపీ బలపడదన్న జీవీఎల్.. ఏపీలో సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. తమ పార్టీలో చేరే నేతలకు మంచి రాజకీయ భవిష్యత్‌ ఉంటుందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైనా విమర్శలు చేశారు జీవీఎల్..

టీడీపీ అంటే విశ్వసనీయత, సిద్దాంతం లేని పార్టీ అని ఎద్దేవా చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పిన జీవీఎల్.. చంద్రబాబు దగ్గర ఏముందని ఆయనతో కలిసి ముందుకు వెళతామని ప్రశ్నించారు. చంద్రబాబుకు బీజేపీలో టీడీపీని విలీనం చేసే ఉద్దేశం ఉంటే నేను మా అధిష్టానంతో మాట్లాడుతాను అన్నారు. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని, ఆ పార్టీ లోక్‌సభ సభ్యులు బీజేపీకి అవసరం లేదన్నారు. కులాలు, మతాలతో రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూశారని అన్నారు. ప్రస్తుతం ఏపీలో తీవ్రంగా కులరాజకీయం నడుస్తుందని ఆరోపించారు. హర్యానాలో బీజేపీలో గెలుస్తుందని జోస్యం చెప్పారు.

Next Story