రూ.100ల కోసం నిలదీసిన భర్త.. భార్య ఆత్మహత్య

రూ.100ల కోసం నిలదీసిన భర్త.. భార్య ఆత్మహత్య
x
Highlights

రూ.100ల కోసం నిలదీసిన భర్త.. భార్య ఆత్మహత్య రూ.100ల కోసం నిలదీసిన భర్త.. భార్య ఆత్మహత్య

ఎంతో అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో డబ్బు చిచ్చు పెట్టింది. రూ.100ల కోసం భర్త.. భార్యను నిలదీయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. దీంతో పిల్లలు అమ్మలేని అనాధగా మారారు. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. మాచవరం మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన రాజాసాహెబ్‌, సైదాబీ దంపతులు భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. పనులకోసం గుంటూరు నగరానికి వలస వచ్చారు. వారి కుమార్తె నాగుల్‌బీని బంధువుల అబ్బాయి అయిన మస్తాన్‌వలికి ఇచ్చి ఆరేళ్ల కిందట వివాహం చేశారు. మస్తాన్‌వలి రైతు బజార్‌లో పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు మగ సంతానం. శనివారం(అక్టోబర్ 12) మస్తాన్ వలి కూలి డబ్బులు తెచ్చి భార్యకు ఇచ్చాడు. అయితే వేరే అవసరం కోసం ఆ డబ్బు తీసుకురమ్మని భార్యకు చెప్పాడు.

అయితే అందులో రూ.100 తక్కువగా ఉన్నాయని.. ఆ వంద రూపాయిలు ఏమి చేసావంటూ నాగుల్‌బీని నిలదీశాడు మస్తాన్. తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆమె సమాధానం చెప్పింది. అయినా వినకుండా భార్యను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. కాసేపటి తర్వాత ఇద్దరు సర్దుకుపోవడంతో గొడవ సద్దుమణిగింది. కానీ భర్త తనను అకారణంగా తిట్టాడని మనస్తాపం చెందింది నాగుల్‌బీ.. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఎలుకల మందు సేవించింది. అపస్మారక స్థితిలో పడివున్న భార్యను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు భర్త. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది.. నాగుల్‌బీ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories