ఇకపై గుంటూరు-తెనాలి మధ్య రైళ్ల వేగం ఎంతో తెలుసా?

ఇకపై గుంటూరు-తెనాలి మధ్య రైళ్ల వేగం ఎంతో తెలుసా?
x
దక్షిణ మధ్య రైల్వే, గుంటూరు డివిజన్
Highlights

గుంటూరు-తెనాలి మార్గంలో రైళ్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి రైల్వే శాఖ ఇంజనీరింగ్ అధికారులు అనుమతి ఇచ్చారు.

గుంటూరు-తెనాలి మార్గంలో రైళ్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి రైల్వే శాఖ ఇంజనీరింగ్ అధికారులు అనుమతి ఇచ్చారు. గత ఏడాది ఏప్రిల్ నుండి కొత్తగా నిర్మించిన ట్రాక్లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో రైళ్లను అనుమతించారు. తరువాత, ఇంజనీరింగ్ విభాగం అధికారులు దశల వారీగా అధిక వేగాన్ని కొనసాగించడానికి ట్రాక్ బలంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

అంతేకాకుండా రైళ్లు వేగంగా నడపడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ట్రాక్ టెస్ట్ ను పూర్తిచేశారు. ఇటీవల ఇందుకు సంబంధించిన తుది నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. వారు ఈ మార్గంలో వేగం పెంచడానికి అనుమతించారు. ఇకపై గుంటూరు-తెనాలి మార్గంలో రైళ్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories