సెల్ఫీలపై నిషేధం విధించిన గుంటూరు పోలీసులు

సెల్ఫీలపై నిషేధం విధించిన గుంటూరు పోలీసులు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ఈ మధ్య కాలంలో చాలా మంది యువత ఎక్కడికి వెళ్లినా సెల్పీలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. సెల్ఫీ మీద ఉన్న ఇష్టంతో చుట్టు పక్కన ఉన్న ప్రాంతాలను కూడా...

ఈ మధ్య కాలంలో చాలా మంది యువత ఎక్కడికి వెళ్లినా సెల్పీలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. సెల్ఫీ మీద ఉన్న ఇష్టంతో చుట్టు పక్కన ఉన్న ప్రాంతాలను కూడా గమనించడం లేదు. రైల్వే స్టేషన్లు, జూపార్కులు, కొండలు, నదీ పరివాహక ప్రాంతాలు ఇలా ఒక్కటేంటి యువతకు చెట్టు కనిపించినా, పుట్ట కనిపించా కూడా సెల్ఫీలే దిగుతున్నారు. దీంతో చాలామంది యువత ప్రమాదాల బారిన పడి వారి ప్రాణాలకు కూడా కోల్పోతున్నారు.

ఇదే కోణంలో చాలా మంది యువత సెల్ఫీలు దిగుతూ తమ ప్రాణాలను కోల్పోతున్నారన్న ఉద్దేశంతో గుంటూరు గ్రామీణ పరిధిలో కృష్ణానది, ఇతర కాల్వల వద్ద సెల్ఫీలు తీసుకోవడంపై పోలీసులు నిషేధం విధించారు. ఇటీవల కండ్లకుంట వద్ద సెల్ఫీ దిగే ప్రయత్నంలో ఓ విద్యార్థిని మృతి చెందాడు. దీంతో అప్రమత్తమైన గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు నదీ పరివాహక ప్రాంతాలలో సెల్ఫీలు దిగడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాకుండా గురువారం పులిచింతల జలాశయానికి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 172.37 అడుగులకు చేరుకుంది. ఈ ప్రవాహాన్ని చూడటానికి వచ్చిన వారు ఇక్కడు సెల్ఫీలు తీసుకోకూడదని తెలిపారు. రిజర్వాయర్లో మొసళ్లు ఉండడంతో అక్కడ సెల్ఫీలు తీసుకునే క్రమంలో ఎవరైనా పొరపాటుగా పడిపోయినా ప్రమాదం అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories