వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి నోటీసులు

mla sridevi on cast issue
x
mla sridevi on cast issue
Highlights

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ సామాజిక వర్గంపై విచారణ సాగుతుందని గుంటూరు జిల్లా పోలీసులు వెల్లడించారు. శ్రీదేవీ...

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ సామాజిక వర్గంపై విచారణ సాగుతుందని గుంటూరు జిల్లా పోలీసులు వెల్లడించారు. శ్రీదేవీ ఎస్సీ సామాజిక వర్గం కాదంటూ గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఫిర్యాదు అందింది. దీనిపై తమ ముందు హాజరుకావాలంటూ శ్రీదేవీకి జేసీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 న మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకావాలని స్పష్టం చేశారు. ధృవీకరణ పత్రాలు, అవసరమైన పత్రాలు, బంధువులను కూడా వెంట తీసుకురావాలంటూ జాయింట్ కలెక్టర్‌ దినేష్ కుమార్‌ తెలిపారు.

గుంటూరు జిల్లాలో తాడికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఎమ్మెల్యే శ్రీదేవి ఎస్సీ సామాజికవర్గం కాదంటూ లీగల్ రైట్స్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేపై ఫిర్యాదు రావడంతో విచారణ చేయాలని ఎన్నికల కమిషన్‌కు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories