గుంటూరు జిల్లా వెలగపూడిలో శాంతించని వర్గపోరు

X
Highlights
* ఎస్సీ కాలనీలో పోలీస్ పికెట్ ఏర్పాటు * రాళ్ల దాడిలో గాయపడిన మొండం బుజ్జి మృతి * బుజ్జి మృతికి పోలీసులే కారణమంటూ ఆందోళన
admin28 Dec 2020 6:05 AM GMT
గుంటూరు జిల్లా వెలగపూడిలో రెండు సామాజిక వర్గాల మధ్య ఏర్పడిన ఆర్చ్ వివాదం ముదురుతోంది. ఎస్సీ కాలనీ మొత్తం డీఎస్సీ జగన్నాథ శ్రీనివాసరావు నేతృత్వంలో పికెట్ ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన గొడవలో మొండెం బుజ్జి తీవ్రంగా గాయపడింది. దాంతో ఆమె విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాంతో మృతురాలి బంధువులు.. మరో వర్గంపై రెచ్చిపోయారు. మృతదేహంతో రాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. బుజ్జి మృతికి పోలీసులే కారణమంటూ నిరసన చేపట్టారు.
బుజ్జి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి పంపకుండా బంధువులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సీఎం జగన్‌ను కోరారు. మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయాలు అయినట్టు తెలుస్తోంది.
Web TitleGuntur district velagapudi problem getting serious
Next Story