తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

Growing devotees in Thirumala
x

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

Highlights

Tirumala: *వేసవి తర్వాతే టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్లు

Tirumala: తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతానికి శ్రీవారి దర్శనానికి వివిధ టిక్కిట్ల ద్వారా దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలు, నిత్య సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం ఇలా పలు విధాలుగా దర్శించుకునే భాగ్యాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఇలా సామాన్య భక్తుల నుంచి వీఐపీలు, వివిఐపిలు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కానీ వీఐపీలు సామాన్యుల మధ్య దర్శన భాగ్యం దక్కే సమయం మాత్రం చాలా తేడా ఉంటుంది. వీఐపీలు, వివిఐపిలకు శ్రీవారి దర్శనానికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంటే సామాన్యులకు మాత్రం 5 నుంచి 24 గంటలు పడుతోంది.

శ్రీవారి దర్శనానికి సామాన్య భక్తులు పడుతున్న కష్టాలను దూరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టైం స్లాట్ సర్వదర్శనం విధానాన్ని పునఃప్రారంభించనుంది. పూర్తిస్థాయిలో లోపాలను సరిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేసిన అనంతరం టైం స్లాట్ సర్వ దర్శనం టోకేన్ల కేటాయింపు.. భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీటీడీ కసరత్తు చేస్తుంది. గత పాలకమండళ్లు సామాన్య భక్తులకు త్వరతగతిన దర్శనభాగ్యం కల్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాయి. అవన్నీ కొంతమేరకు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ భక్తుల తాకిడి అధికంగా ఉండే సమయంలో మాత్రం ఉపయోగపడలేదు. అయితే ముందుగా భక్తులకు సమయ కేటాయింది టైం స్లాట్ ఇవ్వడం ద్వారా భక్తులు క్యూలైన్‌లో వేచి ఉండే సమయాన్ని తగ్గించవచ్చని టీటీడీ భావించింది.

గతంలో టైమ్ స్లాట్ టోకెన్లను జారీచేయడంతో భక్తులు రెండు గంటల్లోనే దర్శనం చేసుకునేవారు. కానీ, ఏప్రిల్ నుంచి వాటిని టీటీడీ నిలిపివేసింది. ఏప్రిల్‌ నెలలో తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో ఈ టోకెన్లను నిలిపివేయగా.. మళ్లీ ప్రారంభిస్తామని ఇటీవలే వెల్లడించింది. కానీ, దీనిని మరోసారి వాయిదా వేస్తున్నట్టు టీటీడీ ఈవో తాజాగా తెలిపారు. తాత్కాలికంగా రద్దు చేసిన టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ల తిరిగి పునరుద్ధరించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే వెల్లడించింది. అయితే, వేసవి రద్దీ నేపథ్యంలో టైం స్లాట్ టోకెన్లు జారీచేయలేమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్‌ టోకెన్ల జారీలో ఏర్పడిన ఇబ్బందులను అధికారులతో చర్చించి త్వరలో జారీ చేస్తామని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories