ఏపీలో గాడి తప్పిన ఆర్థిక క్రమశిక్షణ

Groove missed financial discipline in AP
x

ఏపీలో గాడి తప్పిన ఆర్థిక క్రమశిక్షణ 

Highlights

Nadda: *దేశంలో అవినీతిని పారద్రోలేందుకు చర్యలు తీసుకుంటాం

Nadda: ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లేదని.. కేంద్రం ఇచ్చే నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. కనీసం రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నడ్డా ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జన సభకు నడ్డా ముఖ‌్యఅతిథిగా హాజరయ్యారు. ఈసారి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2014కు ముందు దేశంలో తీవ్రమైన విద్యుత్‌ కోతలు ఉండేవన్నారు. గతంలో ఆరోగ్య రక్షణ, ఆరోగ్య బీమాకు ఎలాంటి హామీ లేదన్నారు.అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తలుగా నిలిచేవని.. మోడీ అధికారంలోకి వచ్చాక అనేక సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. గతంలో బంధుప్రీతి వారసత్వానికి పరాకాష్టగా పాలన సాగేదన్నారు. మోడీ రాజకీయ దృక్కోణాన్ని పూర్తిగా మార్చారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories