కృష్ణాపై రెండు బ్యారేజీలకు గ్రీన్‌ సిగ్నల్‌

కృష్ణాపై రెండు బ్యారేజీలకు గ్రీన్‌ సిగ్నల్‌
x
Highlights

ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో రెండు బ్యారేజీలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రెండు బ్యారేజిలను కృష్ణా, గోదావరి జిల్లాలో నిర్మించనున్నారు. అయితే తాజాగా..

ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో రెండు బ్యారేజీలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రెండు బ్యారేజిలను కృష్ణా, గోదావరి జిల్లాలో నిర్మించనున్నారు. అయితే తాజాగా వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన ఉన్న పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య ఒక బ్యారేజీకి, అలాగే 62 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికొల్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం రావి అనంతవరం మధ్య మరోక బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ తయారు చేయించింది. భూసేకరణకు గాను రూ.204.37 కోట్లను జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యద్శి ఆదిత్యనాథ్‌ దాస్ మంజూరు చేస్తూ ‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలావుంటే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి 3,38,823 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు అందుబాటులో ఉండటం వలన.. పది గేట్లు ఎత్తి, కుడి విద్యుత్కేంద్రం ద్వారా 4,12,345 క్యూసెక్కులను నాగార్జునసాగర్ కు వదులుతున్నారు. ఇక నాగార్జునసాగర్‌లో 589.7 అడుగుల్లో 311.15 టీఎంసీల నీరు ఉండటంతో.. 18 గేట్లు ఎత్తి, విద్యుత్కేంద్రం ద్వారా 3,48,518 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో పులిచింతల కూడా భారీగా వరద నీరు వస్తోంది. సాగర్‌ నుంచి 3,35,858 క్యూసెక్కులు పులిచింతల ప్రాజెక్టులోకి వస్తోంది. ఈ క్రమంలో పులిచింతలలో కూడా ప్రస్తుతం 45 టీఎంసీలు ఉండటంతో 14 గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories