ఏపీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల్లో తనిఖీలు

ఏపీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల్లో తనిఖీలు
x
ఏపీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల్లో తనిఖీలు
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా ఫీజులు వసూలు చేస్తోన్న ప్రైవేటు పాఠశాలల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్...

ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా ఫీజులు వసూలు చేస్తోన్న ప్రైవేటు పాఠశాలల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా 130 పాఠశాలలను అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకున్నారు.

గుంటూరు జిల్లా అరండల్‌పేటలోని శ్రీచైతన్య సీబీఎస్‌ఈ స్కూల్‌లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ స్కూళ్లల్లో తనిఖీలు చేశారు. స్కూళ్లలోని రికార్డులను పరిశీలించారు.

అధిక ఫీజులను వసూళ్ళు చేస్తున్న ప్రైవేట్‌ విద్యా సంస్థలపై పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ అధికారులు తనిఖీలు చేపట్టారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 24 పాఠశాలలో తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురంలతో పాటు ముఖ్యమైన కేంద్రాలలోని ప్రముఖ పాఠశాలలో తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ తనిఖీల విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు అధికారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories