Andhra Pradesh: విశాఖకు ట్రామ్-రైళ్లు..డీపీఆర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం

Andhra Pradesh: విశాఖకు ట్రామ్-రైళ్లు..డీపీఆర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం
x
Highlights

విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చాలని ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. జిల్లాలో మరో అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది.

విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మార్చాలని ప్రతిపాదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. జిల్లాలో మరో అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. మెట్రో ప్రాజెక్టు, పేదలకు ఇళ్ల పంపిణీ గురించి సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం సమీక్షించారు. అనకాపల్లి నుండి భోగపురం వరకు మెట్రో రైలు నిర్మాణానికి ప్రతిపాదనలు గత ప్రభుత్వం చేసింది. దానికి సీఎం జగన్ చిన్న చిన్న మార్పులతో ఆమోదం తెలిపారు. విశాఖపట్నంలో ట్రామ్-రైలు రైలు వ్యవస్థను తీసుకురావడం ద్వారా ట్రాఫిక్ సమస్యను మరింతగా తగ్గించవచ్చని ముఖ్యమంత్రి అధికారుల వద్ద ప్రసావించారు.

ఆర్‌కె బీచ్ నుంచి భీమిలి, పెందుర్తి, ఎన్‌ఎడి వరకు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ట్రామ్-రైళ్లను ఏర్పాటు చేయడం బెటరని సమావేశంలో అధికారులు కూడా సూచించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ట్రామ్స్‌కు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే డీపీఆర్ ను సిద్ధం చేయాలని అధికారులను కోరారు ముఖ్యమంత్రి. కాగా ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, అనకాపల్లి నుండి దువ్వాడ మరియు మధురవాడ నుండి భోగపురం వరకు నడిచే మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. 150 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని మెట్రో, ట్రామ్ కోసం మూడు దశల్లో నిర్మాణాలు చేపట్టనున్నట్టు సమాచారం. కాబట్టి త్వరలో విశాఖపట్నంకు ట్రామ్-రైళ్లు వస్తాయన్నమాట.

Show Full Article
Print Article
Next Story
More Stories