శ్రీశైలంలో గోశాల వివాదం!

srisaila devasthanam Goshala despute
x

srisailadevasthanam goshala (file image)

Highlights

శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.

శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్షంతోనే గోమాతలు మృత్యువాత పడుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. దానికి కౌంటర్‌గా వాస్తవాలు తెలియకుండా క్షేత్రప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించడం సరికాదని అధికారులు చెప్తున్నారు.. గోశాల మీద వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని అనుమానం వచ్చిన వారు ఎవరైనా గోశాలను పరిశీలించవచ్చన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ క్షేత్ర విశిష్టతకు భంగం కలిగేలా వ్యవహరించే వారి పై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు అసలు బీజేపీ నేతలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఏంటి? గోశాలలోలో దేవస్థానం అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏంటి? వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న శ్రీశైల దేవస్థాన గోశాల.

శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే గోమాతలు మృత్యువాత పడుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవాలు తెలియకుండా క్షేత్రప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించడం సరికాదని అధికారులు కౌంటర్ ఇస్తున్నారు. అసలు బీజేపీ నేతలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఏంటి? గోశాలలో దేవస్థానం అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏంటి? వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న శ్రీశైల దేవస్థాన గోశాల.

అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో గోమాతలకు గో సంరక్షణశాలను శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తోంది. ఇటీవల శ్రీశైల దేవస్థానంలో గోసంరక్షణశాలపై సోషల్ మీడియా వస్తున్న వార్తలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో గోసంరక్షణశాలపై వివిధ వివాదాలు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారటంతో ఇప్పుడు అందరి చూపు శ్రీశైల దేవస్థానంపై పడింది.

గతంలో ఎన్నో వివాదాలకు నిలయంగా ఉన్న శ్రీశైల దేవస్థానం తాజాగా గోశాల నిర్వహణలో లోపాలకు పెద్దపీట వేస్తుందంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటోంది. దేవస్థానం ఆదాయం పెంచటంలో అధికారులు చూపే శ్రద్ధ గోవులను సంరక్షించే విషయంలో చూపటం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆలయ అభివృద్ధి పేరుతో భక్తుల నుంచి డబ్బులను వసూలు చేసే దేవస్థానం అధికారులు హిందువులు అమితంగా ఆరాధించే గోవుల మీద ప్రేమ ఎలా చూపిస్తారని విమర్శలు చేస్తున్నారు. మానవతా దృక్పథంతో పాటు సేవదృక్పథం ఉంటేనే గోమాతకు రక్షణ అంటూ తేల్చి చెప్తున్నారు.

ఇటీవల గోశాలలో అధికారుల నిర్లక్ష్యంతోనే గోమాతలు మృత్యువాత పడ్డాయి. దాంతో బిజెపి నేతలతో పాటు హైందవ ధార్మిక సంస్థలు ఆలయ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో సైతం దేవస్థానం తీరును ఎండగడుతూ విమర్శలు చేస్తున్నారు. దేవస్థానం అధికారులు చెప్పే మాటల్లోను చేసే పనుల్లో ఎక్కడ పొంతన కుదరడం లేదని ఆరోపిస్తున్నారు.

శ్రీశైల దేవస్థానంలో 1961లో 13 గోవులతో గోశాల ప్రారంభమైంది. ప్రస్తుతం గో సంరక్షణశాలలో 1352 గోవులున్నాయి. అయితే. గత నాలుగు సంవత్సరాల నుంచి గోశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అతి తక్కువ కాలంలో 800 ఉన్న గోమాతల ను 1325కి పెంచారు. ప్రస్తుతం 4 ఎకరాలలో ఉన్న గోశాలను మరింత విస్తరించేందుకు అధికారులు మరొక 5 ఎకరాలలో కొత్త గోశాల నిర్మాణాలను పూర్తి చేసారు.. 9 ఎకరాలు విస్తీర్ణంలోనే కాక మరికొంత ప్రాంతాన్ని కూడా గోవుల కోసం చదును చేసి సిద్ధం చేశారు దేవస్థానం అధికారులు.

శ్రీశైల గో సంరక్షణశాలలో చాలా మంది భక్తులు గోవులను వదిలి వెళ్తుంటారు. మరికొంతమంది గోవులను సంరక్షించుకోలేక గోశాలకు గోవులను తీసుకొస్తుంటారు. అయితే.. అన్నింటిని ఒకేలా చూస్తామంటున్నారు అధికారులు. ప్రతి ఏటా ఈ గోశాలపై ప్రత్యేక దృష్టి సారించి.. 3 కోట్ల వరకు నిధులను వెచ్చించి గోవుల సంరక్షనకు ఖర్చు చేస్తుందని చెప్తున్నారు.

ప్రతి ఏటా సుమారు వెయ్యి టన్నుల ఎండుగడ్డి, 3 వేల టన్నుల పచ్చిగడ్డి ఇక్కడున్న గోవులకు అందిస్తుంది. అదీకాక 8 ఎకరాలలో స్వయంగా శ్రీశైల దేవస్థానం పశుగ్రాసాన్ని సైతం పెంపకాన్ని నిర్వహిస్తుంది. అందులోనూ శాస్త్ర సంప్రదాయ పద్దతిలో అగ్రికల్చలర్ సైంటిస్ట్‌ల సహాకారంతో కో4, సూపర్ నేఫియర్రకాల గోగ్రాసాన్ని పెంపకం చేస్తుంది. దీంతో పాటు పెద్ద ఆవులకు నందిగోల్డ్స్ సంబంధించిన దానాను పెడుతున్నారు.

గో మాతను దైవంగా భావించే చాలా మంది డోనర్స్ ఎండుగడ్డి, పచ్చిగడ్డి దానం చేస్తుంటారు. ఈ గో సంరక్షణశాలలో గోవులను చూసుకునేందుకు 45 మంది సిబ్బంది ఉంటారు. గోవులను ఉదయం అడవికి తీసుకెళ్లి సాయంత్రం తొలుకుని వస్తుంటారు.

గోవుల రక్షణ కోసం సుశిక్షితులైనటువంటి శిక్షకులను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసింది. గోవుల సంరక్షణలో పనిచేసే వారు ఎంతో నిబద్దతతో ఉంటారు. ప్రతి నిత్యం గోవులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. అందుకోసం ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేశారు.

గోపేడను, గో మూత్రాన్ని శుభ్ర పరుస్తూ గోశాలను పరిశుభ్రంగా ఉంచటం ద్వారా ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా శుభ్రపరుస్తున్నారు. కానీ, బయట మాత్రం అసత్య ప్రచారాలు చేయడంతో వారు ఆవేదన చెందుతున్నారు.

గో సంరక్షణ పై విమర్శలు రావడంతో అధికారులు ప్రక్షాళన చేపట్టారు. గోశాలలో విధులు నిర్వహించే ఉన్నతాధికారిని స్థానిక ముస్లిం మైనార్టీ నేత భార్య కావడంతోనే ఆలయం పై విమర్శలు వస్తున్నాయని అంటున్నారు. నేతల ఆరోపణలు పరిగణలోకి తీసుకున్న దేవస్థానం అధికారులు దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని మరొక శాఖకు బదిలీ చేశారు. ఆరోపణలు చేసే ముందు గోశాలను ఎవరైనా సందర్శించవచ్చని ఈవో అంటున్నారు. క్షేత్ర ప్రాధాన్యతను తగ్గించేలా వివాదాలను ప్రోత్సహించేలా ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని హెచ్చరిస్తున్నారు.

సామాజిక మాధ్యమాలలో వచ్చిన చిత్రాలను పరిశీలించి నేతలు ఆరోపణలు చేయడం సరికాదంటున్నారు అధికారులు. భిన్న వాదనాలు నేపథ్యంలో తాజా వివాదాలతో శ్రీశైల దేవస్థానంలో వాడివేడి వాతావరణం కొనసాగుతోంది. దేవస్థానం పరిధిలో ఎటువంటి ర్యాలీలకు గాని, ఆందోళనలకు, ధర్నాలకు గానీ అనుమతి లేదని ఎవరైనా వాటిని అతిక్రమిస్తే చర్యలు తప్పంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories