logo

గోరంట్ల మాధవ్‌కు కీలక బాధ్యతలు

గోరంట్ల మాధవ్‌కు కీలక బాధ్యతలు
Highlights

ఇటీవల వైసీపీలో చేరిన మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ కు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను హిందూపురం...

ఇటీవల వైసీపీలో చేరిన మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ కు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను హిందూపురం పార్లమెంట్ ఇంచార్జ్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీసు శాఖలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్‌ ఇటీవలే వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కదిరి సీఐగా పనిచేసే సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు

చేశారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు మాధవ్‌. ఆ సమయంలో జేసీపై మీసం మెలేసి సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే . తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ వివాద నేపథ్యంలో జేసీ.. పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన గోరంట్ల మాధవ్‌.. నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు.


లైవ్ టీవి


Share it
Top