క్షతగాత్రుని పట్ల ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఔదార్యం

క్షతగాత్రుని పట్ల ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఔదార్యం
x
గోరంట్ల మాధవ్‌
Highlights

హిందూపురం లోక్ సభ సభ్యుడు గోరంట్ల మాధవ్‌ క్షతగాత్రుని పట్ల ఔదార్యం చాటుకున్నారు.

హిందూపురం లోక్ సభ సభ్యుడు గోరంట్ల మాధవ్‌ క్షతగాత్రుని పట్ల ఔదార్యం చాటుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని దగ్గరుండి తన వాహనంలోనే ఆస్పత్రికి తరలించడమే కాకుండా అతని వైద్య ఖర్చులు కూడా భరిస్తానని హామీ ఇచ్చారు. హిందూపురం మండలంలోని మండలంలోని గజరాంపల్లి గ్రామానికి చెందిన బుచ్చమ్మ గారి వెంకటేశ్వర్‌రెడ్డి (36) మంగళవారం తన పొలానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. ఈ క్రమంలో పనిమీద వెళుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్‌ వాహనాన్ని పొగరూరు కెనాల్‌ గ్రామ క్రాస్‌ వద్ద ద్విచక్ర వాహనం ఢీ కొంది.

దీంతో వెంకటేశ్వరరెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్పందించిన ఎంపీ గోరంట్ల.. వెంకటేశ్వరరెడ్డిని తన వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా అతని చికిత్సకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని డాక్టర్లకు ఫోన్ చేసి చెప్పారు. కాగా రాంగ్‌ రూట్‌లో వెళ్తూ ఎదురుగా వస్తున్న ఎంపీ వాహనాన్ని గమనించకుండా ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. వెంకటేశ్వరరెడ్డిని అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories