Andhra Pradesh: దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ తీపి కబురు

Andhra Pradesh: దసరాకు ఏపీఎస్ ఆర్టీసీ 1వేయి 81 ప్రత్యేక బస్సులు..

Jyothi
Published on: 20 Sept 2022 8:36 AM IST
Good News to Passengers No Special Charges in Dasara Special Buses Says APSRTC
X

Andhra Pradesh: దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ తీపి కబురు

Andhra Pradesh: దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం వెయ్యి 81 అదనపు బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో గతంలో మాదిరి 50 శాతం అదనపు ఛార్జీలు కాకుండా సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేక బస్సుల్లోని టికెట్లకూ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ఈ వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story