తిరుమలలో సామాన్య భక్తులకు శుభవార్త అందించిన టీటీడీ

తిరుమలలో సామాన్య భక్తులకు శుభవార్త అందించిన టీటీడీ
x
Highlights

సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్న టీటీడీ.. తాజాగా సామాన్య భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు...

సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్న టీటీడీ.. తాజాగా సామాన్య భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు అలిపిరిలో వసతి సముదాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్నీ టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఈ అంశంపై ఇవాళ జరగనున్న పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలిపిరి వద్ద నిర్మించనున్న వసతి సముదాయాల స్థలాన్ని ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అలిపిరిలోని కొత్త విశ్రాంతి గృహాలలో అన్న ప్రసాదం, ధార్మిక కార్యక్రమాలు, భజనలు, ధ్యానం, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు.

మరోవైపు తిరుమలలో ప్లాస్టిక్ నిషేధాన్ని గతంలో ప్రకటించిన తరువాత.. ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో ఇది అమలు జరగడం లేదు. టీటీడీ ఎంత ప్రచారం నిర్వహించినా.. ఆంక్షలు పెట్టినా భక్తులు ప్లాస్టిక్ కవర్లను వాడుతూనే ఉన్నారు. దాంతో తిరుమలలో పరిశుభ్రత కరువైంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించే దిశగా కఠిన చర్యలకు టీటీడీ ఉపక్రమించింది. సంక్రాంతి తరువాత తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అప్పుడు కూడా ప్లాస్టిక్ ను వాడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

కాగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేదిస్తూ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను కవర్లలో కాకుండా కాగితంతో తయారు చేసిన సంచులు, జనపనారతో చేసిన సంచుల్లో పెట్టి భక్తులకు అందజేస్తున్నారు. అయితే ఈ సంచులను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ భక్తులు ఈ కవర్లను కొనుగోలు చేయకుండా ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. అలాగే భక్తులు తెచ్చుకునే ఆహార పదార్ధాలు కూడా కొంతమంది ప్లాస్టిక్ కవర్లలోనే తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధ ప్రక్రియ కఠినంగా అమలు కాలేదు. శ్రీవారిని దర్శించడానికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల ఒక్కసారిగా ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడం టీటీడీకి కష్టసాధ్యంగా మారింది. మరి సంక్రాంతి తరువాత అయినా ఈ విధానం కచ్చితంగా అమలవుతుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories