ఏపీలో నిరుద్యోగులకు మరో శుభవార్త.. 16,207 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఏపీలో నిరుద్యోగులకు మరో శుభవార్త.. 16,207 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
x
Highlights

ఏపీలో నిరుద్యోగులకు మరో శుభవార్త వెలువడింది. ఖాళీగా ఉన్న గ్రామ / వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,207 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ క్రమంలో గ్రామ...

ఏపీలో నిరుద్యోగులకు మరో శుభవార్త వెలువడింది. ఖాళీగా ఉన్న గ్రామ / వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,207 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ క్రమంలో గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ వివరాలు వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు అవకాశం గడువు ఉందని చెప్పారు. అలాగే వార్డు సచివాలయాల్లో 2,146 ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ జారీ అయింది.

గ్రామ సచివాలయాల్లో

పోస్టుల వివరాలు ..

పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5 - 61

వీఆర్వో గ్రేడ్‌-2 - 246

ఏఎన్‌ఎం గ్రేడ్‌-3 - 648

గ్రామ మత్స్య శాఖ అసిస్టెంట్ - 69

గ్రామ ఉద్యానవన శాఖ అసిస్టెంట్ - 1782

గ్రామ వ్యవసాయ శాఖ / నహాయకుడు గ్రేడ్‌-2 - 536

గ్రామ సెరికల్చర్ సహాయకుడు - 43

గ్రామ సంరక్షణ కార్యదర్శి - 762

ఇంజనీరింగ్‌ సహాయకుడు - 570

డిజిటల్‌ అసిస్టెంట్‌ - 1134

విలేజ్‌ సర్వేయర్‌ గ్రేడ్‌-3 - 1255

వెల్ఫేర్‌ ఆండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ - 97

పకు సంవర్థక శాఖ సహాయకుడు - 6858

మొత్తం 14,061

వార్డు సచివాలయాల్లో

పోస్టుల వివరాలు ..

వార్డు పరిపాలనా కార్యదర్శి - 105

వార్డు వసతుల కార్యదర్శి - 371

వార్డు పారిశుధ్య , పర్యావరణ కార్యదర్శి - 513

వార్డు విద్య , డేటా ప్రోసెసింగ్ కార్యదర్శి - 100

వార్డు ప్రణాళికా, రేగులాటిన్ కార్యదర్శి - 844

వార్డు సంక్షేమ , అభివృద్ధి కార్యదర్శి - 213

మొత్తం - 2,146

దరఖాస్తుకు వెబ్‌సైట్లు: http://wardsachivalayam.ap.gov.in/, http://gramasachivalayam.ap.gov.in/

కాగా గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన సంగతి తెలిసిందే. గత నోటిఫికేషన్ ప్రకారమే పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ప్రస్తుతం కూడా వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories