Andhra Pradesh: వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

Good News for the YCP Political Unemployed
x

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: పదవుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్న జగన్ సర్కార్ * ఈ నెల 14న అభ్యర్థులను ప్రకటించనున్న వైసీపీ

Andhra Pradesh: వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు పదవులు అందేందుకు స్వం సిద్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తయింది. కార్పొరేషన్ చైర్మాన్‌లతో పాటు డైరెక్టర్‌ల పోస్టులు కలిపి ఒకేసారి భర్తీ చేయనున్నారు. దీనికి ఈనెల 14 తేదీన ముహుర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.! మరోవైపు.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సింగిల్ డిజిట్ నామినేషన్ పోస్టులు తప్ప మిగతావి భర్తీ చెయ్యలేదు. ఈ నేపధ్యంలో ఒకేసారి మిగిలిన పదవులు భర్తీ చేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. దాదాపు 70 కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఆయా కార్పొరేషన్‌‌లకు మరో 840 డైరెక్టర్ల పదవులు భర్తీ కానున్నాయి.

ఇక.. నామినేషన్ పోస్టుల భర్తీ విషయంలో పక్కా ఫార్ములా అమలు చేస్తుంది అధికార వైసీపీ. పదవుల భర్తీని మూడు అంచెలుగా విభజించినట్లు తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యతగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వారికి చైర్మన్ పదవులు దక్కనున్నాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన వారికి ఇందులో ఛాన్స్ ఇస్తున్నారు. చివరిగా పార్టీలో సీనియర్‌లుగా ఉంటూ ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అటు.. డైరెక్టర్ల బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేసినవారికి డైరెక్టర్లుగా పదవులు దక్కనున్నాయి. మొత్తానికి రెండేల్ల ఎదురుచూపులు నెరవేరబోతున్న సమాయం ఆసన్నం కావడంతో ఆశావహులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories