Petrol, Diesel Subsidy: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..పెట్రోల్ , డీజీల్ పై 50శాతం సబ్సిడీ..ఇలా దరఖాస్తు చేసుకోండి?

Petrol, Diesel Subsidy
x

Petrol, Diesel Subsidy: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..పెట్రోల్ , డీజీల్ పై 50శాతం సబ్సిడీ..ఇలా దరఖాస్తు చేసుకోండి?

Highlights

AP Govt Petrol, diesel Subsidy To Disability Persons: పెట్రోల్, డీజీల్ సబ్సిడీని దివ్యాంగులకు అందించాలని నిర్ణయించింది.

AP Govt Petrol, diesel Subsidy To Disability Persons: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాసంక్షేమంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజీల్ సబ్సిడీని దివ్యాంగులకు అందించాలని నిర్ణయించింది. ఈ పథకం కోసం నిధులు కూడా విడుదల చేసింది. రాష్ట్రంలోని 26జిల్లాలకు డబ్బులు పంపిణీ చేసింది. అన్ని జిల్లాల్లో అర్హులైన దివ్యాంగులు అప్లయ్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఈ స్కీం కింద ప్రభుత్వానికి పెట్రోల్, డీజీల్ పై 50శాతం సబ్సిడీ అందించనున్నట్లు తెలిపింది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఏపీ సర్కార్ ఈసారి దివ్యాంగులకు మేలు చేకూరేవిధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం ఉపాధితోపాటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పెట్రోల్, డీజీల్ పై 50శాతం రాయితీని అందించనున్నట్లు తెలిపింది. ఈ స్కీమును 2024-25 ఆర్థిక ఏడాదికి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కోసం రాష్ట్రం మొత్తం 26లక్షల రూపాయలను కేటాయించింది. ఒక్కో జిల్లాలకు రూ. 1లక్ష చొప్పున ఈ నిధులను అందించనుంది ప్రభుత్వం.

ఈ స్కీము కింద మూడు టైర్ల మోటరైజ్డ్ వాహనాలు ఉపయోగించే దివ్యాంగులకు మాత్రమే రాయితీని అందించనున్నారు. వినియోగించే వాహనానికి 50శాతం రాయితీగా పెట్రోల్, డీజీల్ ఖర్చు రీయింబర్స్ ఇవ్వనున్నారు. ఈ డబ్బులు ప్రభుత్వానికి లబ్ది పొందే దివ్యాంగుల బ్యాంకు అకౌంట్లో జమ చేస్తారు.

ఈ స్కీము కొన్ని ముఖ్యమైన నిబంధనలతో కూడుకున్నది. ప్రయాణంకోసం అందించే రాయితీ ఇంటి నుంచి పని ప్రాంతం వరకు ఉంటుంది. అలాగే తిరిగి ఇంటికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. 2 హార్స్ పవర్ ఇంజిన్ కెపాసిటి ఉన్న వెహికల్స్ కు గరిష్టంగా 15లీటర్ల వరకు, 2 హార్స్ పవర్ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటి ఉన్న వెహికల్స్ కు గరిష్టంగా 25 లీటర్ల వరకు సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం దివ్యాంగులకు సంబంధించి కావడంతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories