అనంతపురం నిరుద్యోగులకు శుభవార్త...

అనంతపురం నిరుద్యోగులకు శుభవార్త...
x
Highlights

అనంతపురం జిల్లా నిరుద్యోగులకు శుభవార్త వెలువడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్‌డీసీ), ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళశాల...

అనంతపురం జిల్లా నిరుద్యోగులకు శుభవార్త వెలువడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్‌డీసీ), ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళశాల ఆధ్వర్యంలో డిసెంబరు 2న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఎస్‌డీసీ జిల్లా అధికారి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. కియ కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు 2017, 2018, 2019 సంవత్సరాల్లో పాలిటెక్నిక్‌/డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన యువకులు అర్హులన్నారు.

అయితే ఇప్పటి వరకు వారు ఎక్కడా అప్రెంటీస్‌షి‌ప్‌కు రిజస్టర్‌ చేసి ఉండకూడదని స్పష్టం చేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ రెస్యూమే తోపాటు ఆధార్‌కార్డు, విద్యార్హతసర్టిఫికెట్లు తీసుకుని రావాలన్నారు. మరిన్ని వివరాల కోసం 18004252422, 8247410655, 7658902296 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories