Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌..కొత్త యాప్‌ను విడుదల చేసిన టీటీడీ

Good News for Srivari Devotees TTD has Released a New App
x

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌..కొత్త యాప్‌ను విడుదల చేసిన టీటీడీ

Highlights

Tirumala: యాప్ ప్రారంభించిన టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Tirumala: శ్రీవారి భక్తులకు డిజిటల్ సేవలను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీ దేవస్థానం పేరుతో క్రియేట్ చేసిన యాప్‌ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవచ్చని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విరాళాలు కూడా ఇదే యాప్‌ నుండి అందించవచ్చని చెప్పారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించినట్టు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని, ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా యాప్‌లో చూడవచ్చని చెప్పారు. ఇక భక్తులకు పూర్తి సమాచారం అందించడంలో..డిజిటల్‌ గేట్‌ వేగా ఈ యాప్‌ ఉపయోగపడుతుందని ఈవో ధర్మారెడ్డి అన్నారు. భక్తులు లాగిన్‌ అయ్యేందుకు యూజర్‌ నేమ్‌తోపాటు ఓటిపి ఎంటర్‌ చేస్తే చాలని, పాస్‌వర్డ్‌ అవసరం లేదని ఈవో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories