Kakinada: గొల్లల మామిదాడ సూర్యదేవాలయం..ఎక్కడ ఉందో తెలుసా

Kakinada: గొల్లల మామిదాడ సూర్యదేవాలయం..ఎక్కడ ఉందో తెలుసా
x
Highlights

సమస్త జగత్తులో ప్రత్యక్ష దైవంగా నిలిచి అందరినీ కాచేవాడు సూర్యభగవానుడు. ఏడు గుర్రాల రథంలో సవారీ చేస్తూ సమస్త ప్రాణకోటిని రక్షిస్తాడు.

సమస్త జగత్తులో ప్రత్యక్ష దైవంగా నిలిచి అందరినీ కాచేవాడు సూర్యభగవానుడు. ఏడు గుర్రాల రథంలో సవారీ చేస్తూ సమస్త ప్రాణకోటిని రక్షిస్తాడు. తన కిరణాలతో దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. అలాంటి దేవున్ని ఎంతో మంది భక్తులు ఆధ్యాత్యికతతో కొలుస్తుంటారు.

ఇలా ఎంతో మంది భక్తులు కోరికలు తీర్చే దేవుల్లకి ఆలయాలు నిర్మించి కొలుస్తుంటారు. అలా నిర్మించిన ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో నెలకొని ఉన్నాయి. ఎంతో ప్రఖ్యాతి గాంచిన సూర్యదేవాలయాల్లో ఒకటైన ఆలయం గొల్లాల మామిదాడ సూర్యదేవాలయం. ఈ ఆలయం అరసవల్లి సూర్యనారాణయ స్వామి దేవాలయం తరువాత అంతటి ప్రఖ్యాతి గాంచిన రెండో దేవాలయంగా పేరు తెచ్చుకుంది. అక్కడి సూర్యదేవుని ఒక్క సారి దర్శించుకుంటే చాలు భక్తుల కోరికలు కొంగుబంగారమవుతాయని అక్కడికి వచ్చే భక్తులు నమ్మకం. ఏడు గుర్రాల రథంలో సమస్తాన్ని పాలించే దేవున్ని ఒక్క సారి కన్నులారా వీక్షించినంతనే సకల పాపాలూ తొలగిపోతాయి.

ఆలయం ఎక్కడ ఉంది..

కొబ్బరి తోటలు, పచ్చని పొలాలు, సహజ పరిసరాల మధ్య, ప్రకృతి అందాల నడుమ నుంచి ఈ ఆలయానికి వెళ్లవచ్చు. పక్కనే నదీ పరవళ్లు మధ్యనుండి ఈ ఆలయాన్ని చేరుకోవలసి వస్తుంది. కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుండి 58 కిలోమీటర్ల దూరంలో తూర్పు గోదావరి జిల్లా , పెద్దాపుడి మండలంలోని గొల్లాల మామిదాడ గ్రామంలో నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని 1920 వ సంవత్సరంలో నిర్మానించారు.

ఈ ఆలయంలో ప్రతి నిత్యం పూజలు, అర్చణలు నిర్వహిస్తుంటారు. అంతే కాకుండా సూర్యదేవునికి ఎంతో ప్రీతి పాత్రమైన రోజుగా ఆదివారాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ రోజు ఆ దేవాలయంలో ప్రత్యేకమైన అర్చణలను చేస్తుంటారు. దీంతో ప్రతీ ఆదివారం ఆ ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారి కోరికలను కోరుకుంటుంటారు.

శ్రీ సూర్యదేవాలయం ప్రాంగణంలో వెంకటేశ్వర ఆలయం, సాయి ఆలయం, ప్రసిద్ధ భీమేశ్వర ఆలయం అనేక ఆలయాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories