విశాఖ విమానాశ్రయంలో రూ .51.5 లక్షల బంగారం స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

విశాఖ విమానాశ్రయంలో రూ .51.5 లక్షల బంగారం స్వాధీనం.. ఇద్దరు అరెస్టు
x
Highlights

వైజాగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 51.5 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

వైజాగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 51.5 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ప్రయాణికులు దుబాయ్‌కు చెందినవారు, వారు 1166 గ్రాముల బంగారాన్ని ఇండియాకు తీసుకొస్తున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయడంతో బంగారు ఆభరణాలు బయటపడ్డాయి.

దీంతో వారిని ఎయిర్ పోర్ట్ అధికారులు అరెస్ట్ చేసి.. బంగారాన్ని సీజ్ చేశారు. ఇదిలావుంటే గత మంగళవారం బెంగళూరులోని చిక్‌పేట ప్రాంతంలోని రంగనాథ మాన్షన్, సకలజీ మార్కెట్‌లో దాడులు చేయడంతో అక్రమ ఆభరణాలను బయటపడ్డాయి. వాటికి సరైన పత్రాలు లేకపోవడంతో అనుమానం వచ్చి మొత్తం 21 కోట్ల విలువైన 60 కిలోల అక్రమ బంగారు ఆభరణాలను కర్ణాటక ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ సంగతి మరవకముందే తాజాగా విశాఖలో 51.5 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories