Top
logo

అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్‌ వీడియో షూట్‌

అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్‌ వీడియో షూట్‌
Highlights

అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్‌ వీడియో షూట్‌ అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్‌ వీడియో షూట్‌

అత్యంత చిన్న వయసులో లోక్ సభ సభ్యురాలిగా పార్లమెంటులో అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరగనున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన శివప్రసాద్‌ తో కలిసి ఆమె ఏడడుగులు నడవబోతున్నారు. వీరు పెద్దల అంగీకారంతో విహహం చేసుకోబోతున్నారు. వీరిద్దరూ పెళ్లికి ముందు తమ స్నేహాన్ని, ప్రేమను తెలియజేసేలా ఓ ప్రీ వెడ్డింగ్‌ చేసుకున్నారు. విశాఖ జిల్లాలో ప్రీ వెడ్డింగ్‌ ఫోటోషూట్ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రేమ ముందు అందరూ సమానమే అని ఈ వీడియో రుజువు చేసిందంటున్నారు మాధవి. కాగా మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో వీరి వివాహ వేడుక జరగనుంది. రిసెప్షన్‌ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్‌ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేయనున్నట్టు మాధవి కుటుంబసభ్యులు వెల్లడించారు. వరుడు గొలుగొండ మండలం కెడిపేట గ్రామానికి చెందిన శివప్రసాద్‌ బి.టెక్‌, ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం ఓ కాలేజ్‌ కి కరస్పాండెట్‌గా వ్యవహరిస్తున్నారు.

Next Story

లైవ్ టీవి


Share it