Pulasa : గోదావరి పులస రుచి ఆగస్టు-సెప్టెంబర్ సీజన్‌లో ప్రత్యేక ఆహార ప్రియుల ఉత్సాహం

Pulasa : గోదావరి పులస రుచి ఆగస్టు-సెప్టెంబర్ సీజన్‌లో ప్రత్యేక ఆహార ప్రియుల ఉత్సాహం
x

Pulasa : గోదావరి పులస రుచి ఆగస్టు-సెప్టెంబర్ సీజన్‌లో ప్రత్యేక ఆహార ప్రియుల ఉత్సాహం

Highlights

ఆహా పులస రుచి.. తినరా మైమరిచి అంటారు గోదారోళ్లు గోదావరిలో దొరికే పులస.. వెరీ వెరీ స్పెషల్ పుస్తెలమ్మైనా.. పులస తినాలంటారు మత్స్య ప్రేమికులు పులస చేపలకు గోదావరి జిల్లాలో యమక్రేజ్ పులస పులుసు తింటే చాలు.. జన్మధన్యమంటూరు మరికొందరు కేవలం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే దొరికే పులస చేపలు

గోదావరి జిల్లాలో పులసల సందడి మొదలైంది. గోదావరికి ఎర్ర నీరు రావడంతో పులస చేపల హోరు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. పుస్త్తులమ్మి మైనా పులుస కూర తినాలనేది నానుడి... నిజంగా పులస టేస్ట్ అంత బావుంటుందా అంటే అవుననే అంటారు గోదావరి జిల్లా వాసులు.. ఇక ఈ పులస తింటే.. ఆహా ఏమి రుచి అనక మానరు అంటూ పులస ప్రియులు.. ఇక పులస పులుసైతే అద్భుతం అంటారు.. ఈ నేపథ్యంలో పులస టేస్ట్ కు కారణం ఏమిటి.. పులస పులుసు ఎలా తయారు చేస్తారు.. ఇత్యాది అంశాలపై hmtv ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్ధాం.


పులస అని పేరు వినగానే మత్స్య ప్రియల నోటిలో నీళ్లు ఊరుతాయి. ఉభయగోదావరి జిల్లాలో మాత్రమే దొరికే ఈ పులసకు యమ క్రేజ్.. ఈ పులస చేపలు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. కేవలం రెండు నెలల్లో మాత్రమే ఈ పులసలు లభిస్తాయి.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మాత్రమే దొరికే ఈ పులసను ఎంత ధర ఇచ్చైనా కొనడానికి సిద్ధపడతారు గోదావరి జిల్లా వాసులు.. గోదావరి వాసులకు అంత ఇష్టం ఈ పులసలు..


పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వశిష్ట గోదావరి వద్ద దొంగరావి పాలెం జాతీయ రహదారి పక్కన పులస చేలప విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.. గోదావరికి ఎర్ర నీరు రావడంతో పులసలు విరివిగా లభిస్తున్నాయి.. వాటిని కోనేందుకు మాంసాహార ప్రియలు క్యూలైన్ కడుతున్నారు. ముఖ్యంగా గోదావరి నదిలో లభించే పులసకి అరుదైన రుచి వుంటుందట. కనీసం ఒక్క పులస నైనా వండించుకు తినాలని పులస ప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు. పులసలు గత సంవత్సరం ధరలుతో చూసుకుంటే ఈ సంవత్సరం సామాన్యులకు అందుబాటులో లభిస్తున్నాయి అంటున్నారు జాలరి అచ్చియ్య. కేజీ పులస 2వేలు నుండి 6 వరుకు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి.. బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం చేపలు ఆర్డర్ పై బాక్స్లో ప్యాక్ చేసి పంపిస్తామని అంతే అంతేకాకుండా మట్టి కుండలో వండిన పులస పులుసు ప్యాక్ చేసి పంపుతున్నామన్నారు వర్తకులు..


ఈ పులస గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని 'వలస చేప' అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వాళ్ళు 'హిల్సా అని కూడా పిలుస్తారు. పులస పుట్టుక విచిత్రంగా ఉంటుంది. 'హిల్సా ఇలీషా' అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అని పిలుస్తారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి.


నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ పులస చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్‌, యానాం, సిద్ధాంతం నుండి అంతర్వేది సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి.


పులస చేప పులుసు రుచి వెనుక పెద్ద స్టోరీయే ఉందంటున్నారు గోదారొళ్లు.. పులుసుల అమ్మకాలే కాకుండా.. పులస పులుసు కూడా వండి మరి మాంసాహార ప్రియులకు సరసమైన ధరల్లో అందిస్తున్నారు స్థానిక వర్తకులు.. పులస పులుసు వండే విధానం మామూలు చేపల కర్రీలా ఉండదంటున్నారు ఇక్కడి చేపల వంటకంలో ఆరితేరిన మహిళలు..సముద్రంనుండి గోదావరి వరదనీటిలోకి ఎదురీదడంవల్ల ఈ చేపలకు అమోఘమైన రుచివస్తుందని. ఈ పులసచేపల్లోనూ ఆడ చేప, మగ చేప ఉంటాయంటున్నారు గోదావరి చేపల వర్తకులు.. ఇందులో ఆడ చేప రుచి ఎక్కువగా ఉండడంవల్ల ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుందట.. ఈ చేపకు ముళ్ళు చాలా ఎక్కువగా వుంటాయి.


పులస చేపకు రుచి తెప్పించేది ప్రధానంగా వండే విధానమే అంటున్నారు స్థానిక మహిళలు. మట్టి కుండతో వండితే మంచి రుచి వస్తుందంటున్నారు. ఈ చేపను పులుసుగా మాత్రమే వండుతారు. ఇందులో బెండకాయలు, ఆవనూనె, వెన్నపూస, ఎండుమిర్చి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని రకాల దినుసులు వేసి వండుతారు. పొద్దుట వండిన కూర సాయంత్రానికి మరింత రుచినిస్తుంది. లేదా రాత్రి పూట వండిన పులస పులుసును తెల్లారి ఉదయం తింటే చాలా రుచికరంగా వుంటుందంటున్న మహిళల మాటలను.. ఆమె మాటల్లోనే వినండి..

స్పాట్... పులస పులుసు వండే విధానాన్ని పూర్తిగా చూపండి..

మత్స్య ప్రియులకే కాదు.. సామాన్యులు కూడా పులస రుచి కోసం గోదావరి జిల్లాల్లో ఎంతో ఆరాటపడతారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో దొరికే ఈ చేప కోసం ఏడాదంతా ఎదురుచూస్తారు. ఎందుకంటే.. ఈ చేప

రుచి అలాంటిది.. ఏది ఏమైనా జీవితంలో ఒక్కసారైనా పులస కూర తినాల్సిందే .. పులస పులుసు ఆస్వాదించాల్సిందే.. అంటారు గోదావరోళ్లు..

Show Full Article
Print Article
Next Story
More Stories