చంద్రబాబు ఆరోపణలు ఖండించిన G.N. రావు కమిటీ

చంద్రబాబు ఆరోపణలు ఖండించిన G.N. రావు కమిటీ
x
Gn Rao
Highlights

-రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల సమీక్ష -రాష్ట్ర సమగ్రాభివృద్ధి సలహాల కోసం కమిటీ ఏర్పాటు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపణలను G.N. రావు కమిటీ ఖండించింది. ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ 585 మేరకు రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల సమీక్ష, రాష్ట్ర సమగ్రాభివృద్ధి సలహాల కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు G.N. రావు కమిటీ పేర్కొంది. సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం సూచనల మేరకే G.N. రావు కమిటీ నివేదిక సమర్పించినట్లు చంద్రబాబు నాయుడు అనడం నిరాధారం, అవాస్తవమన్నారు. కమిటీలోని సభ్యులంతా ఆయా రంగాల్లో నిష్ణాతులన్నారన్నారు. కమిటీలోని సభ్యులను ప్రభావితం చేసి నివేదిక తయారు చేశారనడం అర్ధరహితమని పేర్కొన్నారు. వివిధ జిల్లాల్లోని ప్రజల ఆకాంక్షలను సేకరించి వాటిని నివేదికలో మదింపు చేశామని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories