కమిటీ సభ్యులు ప్రలోభాలకు లొంగే వ్యక్తులు కాదు : జీఎన్ రావు

కమిటీ సభ్యులు ప్రలోభాలకు లొంగే వ్యక్తులు కాదు : జీఎన్ రావు
x
జీఎన్ రావు కమిటీ రిపోర్టు
Highlights

రాష్ట్రంలో తమ కమిటీ 13 జిల్లాలో పర్యటించి ప్రభుత్వానికి అభివృద్ధికి సంబంధించిన రిపోర్టు అందజేశామని జీఎన్ రావు తెలిపారు.

రాష్ట్రంలో తమ కమిటీ 13 జిల్లాలో పర్యటించి ప్రభుత్వానికి అభివృద్ధికి సంబంధించిన రిపోర్టు అందజేశామని జీఎన్ రావు తెలిపారు. కమిటీ సభ్యులను ప్రభావితం చేశారని తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. జీఎన్ రావు నివేదికను తగలబెట్టడం బాధకరమని వ్యాఖ్యానించారు. కొన్ని పత్రికలు, ఛానల్లు తన నివేధికపై తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని తెలిపారు. ఆ మీడియాలో వచ్చిన వార్తలను తాము ఖడింస్తున్నట్లు ఆయన తెలిపారు. విశాఖను పరిపాలన రాజధానిగా పెట్టొద్దని తాము చెప్పలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉంచాలని తమ రిపోర్ట్ లో చెప్పామని తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ ఉత్తమని అన్నారు.

అలాగే రాష్ట్రంలో 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించామని జీఎన్ రావు వెల్లడించారు. ఏపీ సమగ్రాభివృద్ధిపై కమిటీ ఇచ్చిన రీపోర్ట్‌పై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తల ప్రచురించాయని అన్నారు. విశాఖ, విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలపై అధ్యాయం చేశామని తెలిపారు. విశాఖలో రాజధాని ఎటువైపు ఉండాలో కూడా నివేదికలో స్పష్టంగా ఉంచామని చెప్పారు. మౌలిక సదుపాయాలు విశాఖలో అందుబాటులో ఉన్నాయని అన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి ఆకాంక్షించే మూడు రాజధానులు ప్రతిపాదన సూచించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 4 స్థానిక కమిషనరేట్లు అభివృద్ది వికేంద్రీకరణ కోసం ఏర్పాటు చేయాలని నివేదికలో స్పష్టంగా ఉంచామని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఉంటే నాలుగు జిరాక్స్ సెంటర్లు వస్తాయని అనడం సరైంది కాదని అన్నారు. జీఎన్ రావు కమిటీలో 40 ఏళ్లు అనుభవం ఉన్నవారు ఉన్నారని, ఎవరూ ప్రలోభాలకు లొంగే వారు కాదని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు వివిధ రంగాల్లో అనుభవం కలవారని, నాలుగు నెలలు కష్టపడి పూర్తి రిపోర్టు అందజేశామని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories