
Geethu Royal: రీల్స్ చేయడమేలా ..తర్వాత ఈ ఏడుపేలా..!
Geethu Royal: బిగ్ బాస్ బ్యూటీ, సోషల్ మీడియా సెన్సేషన్ గీతూ రాయల్ మరోసారి వార్తల్లో నిలిచారు.
Geethu Royal: బిగ్ బాస్ బ్యూటీ, సోషల్ మీడియా సెన్సేషన్ గీతూ రాయల్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె ఏదో షో గురించో, రీల్ గురించో కాదు.. సాక్షాత్తూ కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధిలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో నెట్టింట తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ వస్తున్న విమర్శలు, టీటీడీ విజిలెన్స్ చర్యల హెచ్చరికల నేపథ్యంలో గీతూ స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, భక్తిభావంతో సాగాల్సిన ఆ పర్యటనలో రీల్స్ చేయడం వివాదానికి దారి తీసింది.తిరుమల ఘాట్ రోడ్డు, శ్రీవారి ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో గీతూ తన స్నేహితులతో కలిసి వీడియోలు చేశారు. 'ఖడ్గం' సినిమాలోని "గోవిందా గోవిందా" పాటకు డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేయడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది.
సాధారణంగా తిరుమల వంటి ఆధ్యాత్మిక క్షేత్రాల్లో సినిమా పాటలకు డ్యాన్సులు చేయడం నిషిద్ధం. కానీ, వ్యూస్ కోసం పవిత్రతను పక్కన పెట్టారంటూ నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. వివాదం ముదరడంతో గీతూ ఆ వీడియోలను డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే అవి వైరల్ కావడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.
తనపై చర్యలు తీసుకుంటారన్న వార్తలు విన్న గీతూ రాయల్, సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె ఆవేదనతో కూడిన వ్యంగ్యాన్ని ప్రదర్శించారు.అందరికీ గుడ్ న్యూస్.. నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేసినందుకు థ్యాంక్స్. ఆల్రెడీ నా సగం జీవితం పోయింది, ఇంకా పోవడానికి ఏమీ లేదు. ఉన్నది కూడా పోగొట్టేయండి.. అప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండండి.
ఈ వీడియో చూస్తుంటే గీతూ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో బిగ్ బాస్ షో సమయంలో కూడా ఆమె ప్రవర్తనపై తీవ్రమైన నెగిటివిటీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ కావడంతో ఆమె తట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది.
గీతూ వీడియోపై సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది.నిబంధనలు అందరికీ ఒక్కటే. సెలబ్రిటీ అయితే రూల్స్ అతిక్రమించవచ్చా? పవిత్ర స్థలాల్లో ఇలాంటి డ్యాన్సులు చేయడం తప్పు అని కొందరు వాదిస్తున్నారు.ఆమె కావాలని చేయలేదు కదా, ఇప్పటికే వీడియో డిలీట్ చేసింది. ఒక చిన్న పొరపాటుకు ఇంతలా వేధించడం సరైనది కాదు అని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
సోషల్ మీడియా యుగంలో రీల్స్ చేయడం తప్పు కాదు, కానీ ఎక్కడ చేస్తున్నాం అనే విచక్షణ ముఖ్యం. ముఖ్యంగా కోట్లాది మంది మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల వంటి క్షేత్రాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ వివాదం గీతూ రాయల్‌కు మాత్రమే కాదు, రీల్స్ పిచ్చితో నిబంధనలు అతిక్రమించే ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక లాంటిది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




