Gitam University: గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాల కూల్చివేతపై హైకోర్ట్ స్టే!

Geetham University: గీతం యూనివర్సిటీ కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది.
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని కొంత భూమి ప్రభుత్వానికి చెందినదంటూ.. దాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల నుంచే భారీగా పోలీసులను మోహరించి.. పొక్లెయిన్‌లతో కూల్చివేత చేపట్టారు. ఈ విషయం తెలిసిందే. ఈ కూల్చివేతలపై గీతం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో గీతం విశ్వవిద్యాలయం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. నవంబర్ 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 30కి వాయిదా వేసింది.
గీతం యూనివర్సిటీలో అక్రమ కట్టడాలను కూల్చివేయడమే కాకుండా ఆ వెంటనే నిర్ణయించిన హద్దుల వరకూ ఫెన్సింగ్ వేశారు. ఈ క్రమంలో కొన్ని నిర్మాణాలతో పాటు గీతం వర్సిటీ ప్రధానద్వారం, సెక్యూరిటీ గదులు, మైదానం చుట్టూ ప్రహరీ తొలగించారు. ఏసీపీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వందమందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆర్డీవో పెంచలకిశోర్ ఆధ్వర్యంలో సుమారు 40 మంది రెవెన్యూ సిబ్బంది ఈ కూల్చివేత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత పనులు చేపట్టారంటూ గీతం యాజమాన్యం ఆరోపించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే విధించింది.
చిత్రహింసలు పెట్టిన కొడుకు, కోడలిపై వృద్ధ దంపతుల న్యాయపోరాటం..
28 Jun 2022 9:14 AM GMTనిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMT
Health Tips: ఈ జ్యూస్‌లు తాగితే ప్రమాదంలో పడినట్లే..!
29 Jun 2022 9:30 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి...
29 Jun 2022 9:26 AM GMTఅమర్నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్.. యాత్రకు వెళ్లిన 3వేల మంది భక్తులు..
29 Jun 2022 9:02 AM GMTYCP Plenary: జులై 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ
29 Jun 2022 8:10 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMT