విశాఖలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం

విశాఖలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం
x
Highlights

ఎన్ని కఠిన శిక్షలు వేసినా కొందరు యువకుల బుద్ధి మారడం లేదు.. దేశవ్యాప్తంగా అత్యాచారాలపై కఠినంగా శిక్షిస్తున్నారు.

ఎన్ని కఠిన శిక్షలు వేసినా కొందరు యువకుల బుద్ధి మారడం లేదు.. దేశవ్యాప్తంగా అత్యాచారాలపై కఠినంగా శిక్షిస్తున్నారు.. జీవితాంతం జైల్లోనే ఉండేలా కొందరిని శిక్షిస్తుంటే వారిని చూసి కూడా నేర్చుకోవడం లేదు కొందరు యువకులు.. మద్యం మత్తులో మహిళ మీద పశువులా పడి 'ఆమె' జీవితాన్ని నాశనం చేస్తున్నారు..

తాజాగా విశాఖలో కైలాసగిరిపై దారుణం చోటు చేసుకుంది. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు యువకులు.. కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకున్నాక ఈ దురాగతానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారు. నమ్మివచ్చిన యువతిపై దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు కోరుతున్నారు. పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీనుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories