గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యం

Four School Students Missed in Mangalagiri Guntur District | AP Live News
x

గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యం

Highlights

Guntur: *పేరెంట్స్‌ను తీసుకొని రావాలని చెప్పిన ఉపాధ్యాయులు *భయంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన నలుగురు విద్యార్థులు

Guntur: గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యం కలకలం రేపుతోంది. రాజీవ్ గృహకల్పకు చెందిన విద్యార్థులు వెంకటేష్, ప్రభుదేవా, సంతోష్‌.. ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. మరో విద్యార్థి వెంకటేశ్‌ ఎర్రబాలెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు.

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఉదయం స్కూల్‌కి వెళ్లి బ్యాగులు తరగతి గదిలో పెట్టి బయటకు వెళ్లిపోయారు. మళ్లీ సాయంత్రం వచ్చి బ్యాగులు తీసుకొని వెళ్తుండగా ఉపాధ్యాయులు గమనించి పాఠశాలకు రాకుండా ఎక్కడ తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఉదయం తల్లిదండ్రులను తీసుకొని పాఠశాలకు రావాలని చెప్పడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

ఎర్రబాలెంలోని పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థి వెంకటేశ్‌తో కలిసి మిగిలిన ముగ్గురూ నిన్న సాయంత్రం 7గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories