అమరావతిలో జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వ్యక్తుల అరెస్ట్

అమరావతిలో జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వ్యక్తుల అరెస్ట్
x
Highlights

అమరావతిలో నిరసనల నేపథ్యంలో ఉద్దండరాయునిపాలేం లో మీడియా వ్యక్తులపై దాడి చేసిన కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గోగులముడి...

అమరావతిలో నిరసనల నేపథ్యంలో ఉద్దండరాయునిపాలేం లో మీడియా వ్యక్తులపై దాడి చేసిన కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గోగులముడి సురేందర్, పత్తిపాటి శ్రీనివాస రావు, పత్తిపాటి సతీష్, అల్లెవా శివాబాబు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు కు కాకుండా వేరే చోటుకు తరలించడంపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దాడిలో గాయపడ్డ మహిళా జర్నలిస్ట్ తోపాటు మరో ముగ్గురిని పొలిసు ఉన్నతాధికారులు పరామర్శించినట్టు తెలుస్తోంది. వారి ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేశారు పోలీసులు.

కాగా శుక్రవారం రాజధాని ప్రాంతంలో కవరేజి కోసమని ప్రముఖ మీడియా జర్నలిస్టులు వెళ్లారు. అయితే వారిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు కొందరు వ్యక్తులు. ఈ దాడి యాదృచ్చికంగా కాకుండా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. దాంతో అమరావతి ప్రాంతంలో కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. ఎవరైనా హింసాత్మక ఆందోళనలకు పాల్పడితే వారిని అదుపులోకి తీసుకొని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే పోలీసుల చర్యలపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. తమకు జరిగిన అన్యాయంపై పోరాడుతుంటే వారి ఉద్యమాన్ని, ఆవేదనను అణచివేసే విధంగా పోలీసులు ప్రవర్తించడం మంచిది కాదని చెబుతున్నారు. ఆందోళన చేసే వారికి ఆటంకం కలిగిస్తే తాము కూడా ధర్నాకు దిగుతామని టీడీపీ , జనసేన పార్టీలు ఇప్పటికే హెచ్చరించాయి.

మరోవైపు ఆదివారం రాజధాని ప్రాంతంలోని రైతుల ఆందోళన 12వ రోజు కొనసాగుతోంది. తుల్లూరు , వెలగపూడి లలో రిలే నిరాహార దీక్షలకు దిగారు కొందరు వ్యక్తులు. తెల్లవారుజాము నుంచే రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు రోడ్డుపైకి వెళ్లి దీక్షా శిబిరాల్లో పాల్గొన్నారు. బిజెపి ఎంపి సుజనాచౌదరి నేతృత్వంలోని బృందం రాజధాని గ్రామాల్లో పర్యటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దండరాయునిపాలం లో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు, ఆ తరువాత అక్కడి నుంచి సుజనా బృందం తుల్లూరుకు చేరుకొని ఆందోలన చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories