వైసీపీతో ఎనిమిదేళ్ల అనుబంధాన్ని వదులుకొని తప్పుచేశా : టీడీపీ నేత

వైసీపీతో ఎనిమిదేళ్ల అనుబంధాన్ని వదులుకొని తప్పుచేశా : టీడీపీ నేత
x
Highlights

వైసీపీతో ఎనిమిదేళ్ల అనుబంధాన్ని వదులుకొని తప్పుచేశా : టీడీపీ నేత వైసీపీతో ఎనిమిదేళ్ల అనుబంధాన్ని వదులుకొని తప్పుచేశా : టీడీపీ నేత

టీడీపీ సీనియర్ నాయకుడు, చిత్తూరు మాజీ జడ్పీ చైర్మన్ ఎం. సుబ్రమణ్యరెడ్డి వైసిపిలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన చేరికకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జిల్లా మంత్రులు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామితో సుబ్రహ్మణ్యంరెడ్డి మంతనాలు సాగించినట్టు సమాచారం. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సుబ్రమణ్యరెడ్డిని వైసీపీలో చేర్చుకోవడానికి అనుమతి ఇచ్చారు. చంద్రబాబుపై కాంగ్రెస్ తరుపున మూడుసార్లు పోటీ చేశారు సుబ్రహ్మణ్యంరెడ్డి.

అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాశశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ నేతృత్వంలో వైసీపీ ఏర్పాటైన తరువాత.. సుబ్రమణ్యరెడ్డి జెడ్పి చైర్మన్ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ తరువాత మాజీ మంత్రి ఎన్ అమరనాథారెడ్డి ఒత్తిడి మేరకు 2017లో టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు చేతనైన సాయం చేశారు. అయితే తాజాగా పార్టీ మార్పుపై ఆయనను సంప్రదించగా కొన్ని అనివార్య పరిస్థితులలో వైసీపీ నుండి టీడీపీలో చేరాల్సి వచ్చింది. పార్టీతో ఎనిమిదేళ్ల అనుబంధం తర్వాత వైసీపీని వదిలి తప్పు చేశానని ఆయన చెప్పారు. త్వరలో వైసీపీలో చేరతానని వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories