అందుకే బీజేపీలో చేరాను : ఆది నారాయణరెడ్డి

అందుకే బీజేపీలో చేరాను : ఆది నారాయణరెడ్డి
x
Highlights

ఏపీ మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. జగన్ చెప్పేదొకటి...

ఏపీ మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. జగన్ చెప్పేదొకటి చేసేదొకటని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. రాజధాని అమరావతి అయోమయస్థితిలో ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిలుల్లో రాష‌్ట్ర అభివృద్ధికి బీజేపీ సహకారం ఎంతో అవసరమని, అందుకే ఆ పార్టీలో చేరినట్లు ఆది నారాయణరెడ్డి తెలిపారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆది నారాయణ. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరిగింది. చివరకు సోమవారం ఆయన బీజేపీలో చేరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories