Vallabhaneni Vamshi: పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Vallabhaneni Vamshi: పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
x
Highlights

Vallabhaneni Vamshi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో ఏపీ పోలీసులు...

Vallabhaneni Vamshi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో ఏపీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వంశీని విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ కేసులో వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఎట్టకేలకు వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గత 7 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తలదాచుకున్న వంశీని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గత వైసీపీ పాలనలో టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. అయితే ఆయన కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారు. గురువారం హైదరాబాద్ లో రాయదుర్గం పోలీసుల సహకారంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే వంశీ పోలీసులతో తనకు ముందస్తు బెయిల్ ఉందని..ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ గొడవకు దిగారు. అయితే ఇది వేరే కేసు అంటూ పోలీసులు వంశీని అరెస్టు చేసి విజయవాడకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories