తన జన్మదిన రోజునే మరణదిన వేడుకలు జరుపుకొంటున్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు

* ప్రకాశం జిల్లాలో మరణ దిన వేడుకలకు అందరూ తరలి రావాలంటూ పత్రికలు పంచుతున్న మాజీ మంత్రి పాలేటి రామారావు

R Tripura Malini
Published on: 17 Dec 2022 8:30 AM IST
Former Minister Dr Paleti Rama Rao Is Celebrating His Death Anniversary On His Birthday
X

తన జన్మదిన రోజునే మరణదిన వేడుకలు జరుపుకొంటున్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు

Dr Paleti Rama Rao: ఏపీ మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు తన జన్మదిన రోజునే మరణదిన వేడుకలు జరుపుకొంటున్నారు. ఇందుకోసం ప్రకాశం జిల్లాలో తన మరణ దిన వేడుకలకు అందరూ తరలిరావాలంటూ మాజీ మంత్రి పాలేటి రామారావు పత్రికలు పంచుతున్నారు. తాను 75 సంవత్సరాలు జీవించాలనుకున్నానని, 63 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని మాజీ మంత్రి అంటున్నారు. తనకు మరో 12 సంవత్సరాలు మాత్రమే బతకాలని కోరిక ఉందంటూ మాజీ మంత్రి పాలేటి ఓ వీడియో విడుదల చేశారు. అయితే పాలేటి మరణ దిన వేడుకల్లో ఎంతమంది అభిమానులు పాల్గొంటారోనని ప్రతిపక్ష పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story