దేవుడి స్క్రిప్ట్ ఇదేనా ముఖ్యమంత్రి జగన్ గారు? మాజీ మంత్రి దేవినేని ఎద్దేవా

దేవుడి స్క్రిప్ట్ ఇదేనా ముఖ్యమంత్రి జగన్ గారు? మాజీ మంత్రి దేవినేని ఎద్దేవా
x
Former minister Devineni uma
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామ సచవాలయాల భవనాలకు రంగుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ రంగులు తొలగించే పనిలో ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామ సచవాలయాల భవనాలకు రంగుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. హైకోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ రంగులు తొలగించే పనిలో ఉంది.పూర్తి స్థాయిలో వైసీపీ జెండాను పోలిన రంగులు కాకుండా.. మరో రంగు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వేసిన నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కొత్తగా ఎర్రమట్టి రంగు వేయాలని ప్రభుత్వం ఐఏఎస్‌ఎల కమిటీ మార్గదర్శకాలను విడుదల చేశారు.

కొత్తగా ఎర్రమట్టి రంగు నేలకు ప్రతీకగా.. బ్లు కలర్ నీలి విప్లవానికి.. తెలుపు క్షీర విప్లవానికి.. ఆకుపచ్చ రంగు వ్యవసాయానికి ప్రతీకగా ఉన్నాయని ప్రభుత్వ అంటోంది. అయితే దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే.. సచవాలయాలకు రంగులు మార్చడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.

కరోనా క్లిష్టసమయంలో ముందుండి నడిపించే ఉద్యోగస్తులకు సగంజీతాలే ఇస్తారు, డాక్టర్లకి మాస్కులు కూడా అందించరు, కానీ 'వేల కోట్లు ప్రజాధనం ఖర్చుపెట్టి ప్రభుత్వ భవనాలకు వేసిన మీ పార్టీ రంగులు మార్చడానికి మళ్ళీ కోట్లు ఖర్చుపెడుతున్నారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనా ముఖ్యమంత్రి జగన్ గారు' అంటూ ట్విట్టర్ లో నిలదీశారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories