పులిపిల్లలకు సీఎం జగన్, మంత్రి బాలినేని ఆయన మనవడి పేర్లు..

పులిపిల్లలకు సీఎం జగన్, మంత్రి బాలినేని ఆయన మనవడి పేర్లు..
x
Highlights

పులిపిల్లలకు సీఎం జగన్, మంత్రి బాలినేని ఆయన మనవడి పేర్లు..

తిరుపతి శ్రీవెంకటేశ్వర జూ పార్కులో ఐదు తెల్లపులి పిల్లలు జన్మించాయి. జూ పార్కుకు చెందిన తెల్ల పులులు సమీర్‌, రాణిలకు పుట్టిన సంతానానికి రాష్ట్ర అటవీశాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం నామకరణం చేశారు. 'మూడు మగ పులి పిల్లలకు వాసు (తనపేరు), సిద్ధాన్‌(మనవడి పేరు), జగన్‌ ( సీఎం జగన్ పేరు) అని... ఆడ పులి పిల్లలకు విజయ, దుర్గ' అనే పేర్లు పెట్టినట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాగా తిరుపతి ఎస్వీ జూపార్కులో వైట్‌ టైగర్‌ రెండ్రోజుల క్రితం ఈ పులి పిల్లలు జన్మించాయి. వన్యప్రాణి వారోత్సవం సందర్భంగా అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి శుక్రవారం జూపార్కుకు వచ్చారు. ఈ సందర్భంగా ఐదు పులి పిల్లలు పుట్టిన విషయాన్ని జూపార్కు అధికారులు మంత్రికి తెలియజేశారు. దాంతో ఆయనే ఈ పేర్లు పెట్టినట్టు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories