కత్తిపూడిలో మరో 5 కరోనా కేసులు

కత్తిపూడిలో మరో 5 కరోనా కేసులు
x
Highlights

ఏపీలో కరోనా ఉదృతి పెరిగిపోతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా ఉదృతి పెరిగిపోతోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని కత్తిపూడిలో ఈ ఐదు కేసులు నమోదైనట్లు పెద్దాపురం ఆర్డీవో మల్లిబాబు వెల్లడించారు. వైరస్‌ నిర్ధారణ అయిన తర్వాత ఐదుగురిని కాకినాడలో ఐసోలేషన్‌వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు. దీంతో ఈ జిల్లాలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 17కి చేరింది.

జిల్లాలోని శంఖవరం మండలంలోని కత్తిపూడి గ్రామంలో ఇటీవల ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆ వ్యక్తితో సంబంధం ఉన్న 30 మంది శాంపిల్స్ సేకరించగా వారిలో 5 మందికి కరోనా ఉన్నట్లు ఆర్డీవో తెలిపారు.

తాజాగా కొత్త కేసులు నమోదు కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని... అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆర్డీవో ప్రజలకు సూచించారు. అంతేకాకుండా కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు కత్తిపూడి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తిస్తే ఆరోగ్య శాఖ సిబ్బందికి వెంటనే తెలియజేయాలన్నారు. తాజా కేసులతో ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 369కి చేరాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories