వలల ఘర్షణకు పాల్పడిన మత్స్యకారులకు బెయిల్

X
Highlights
* జైలుకెళ్లిన 28 మందికి ఆంక్షలతో కూడిన బెయిల్ మంజూరు * వారానికోసారి కోర్టుకు హాజరుకావాలని పరిమితులు * ఒక వర్గానికి శుక్రవారం, మరో వర్గానికి శనివారం రావాలని సూచన
Sandeep Eggoju30 Dec 2020 1:40 AM GMT
ప్రకాశం జిల్లాలో వలల విషయంలో ఘర్షణకు పాల్పడి జైలుకెళ్లిన 28 మందికి బెయిల్ మంజూరైంది. కండిషనల్ బెయిల్ ఇచ్చిన కోర్టు. వారాని ఒకసారి కోర్టుకు హాజరుకావాలని పరిమితులు విధించింది.
ఒక వర్గానికి శుక్రవారం, మరో వర్గానికి శనివారం రావాలని సూచించారు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి. ఇక బెయిల్ మంజూరు కావటంతో ఇవాళ బల్లవల వాడరేవుకు చెందిన 12 మంది, ఐలవల కఠారీ పాలెంకు చెందిన 16 మంది మత్స్యకారులను పూచీకత్తుపై విడుదల చేయనున్నారు.
Web TitleFisher men got the bail in nets issue
Next Story