Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక

ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ (ఫోటో ది హన్స్ ఇండియా)
Prakasam Barrage: పులిచింతల 16వ గేటు విరిగిపోవడంతో దిగువకు నీటివిడుదల * పులిచింతల ప్రాజెక్టు దగ్గర 5,11,073 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో
Prakasam Barrage: పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిపోవడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. పులిచింతల నుంచి వరద పోటెత్తుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 4 లక్షల 34 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు అధికారులు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు ముంపు ముప్పులో ఉండగా.. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక దిగువ ప్రాంతాల్లోని వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. పులిచింతల ప్రాజెక్ట్ కి ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది.
ప్రాజెక్టు 16వ గేటు విరిగిపోవడంతో అప్రమత్తమైన అధికారులు మిగిలిన గేట్లపై ఒత్తిడి పడకుండా చర్యలు తీసుకున్నారు. మొత్తం 17 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ నుంచి ఇన్‌ఫ్లో లక్షా 84 వేల క్యూసెక్కులు ఉంటే ఐదు లక్షల 11 వేల క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 22 టీఎంసీల నీరుండగా ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో గేటు అమరిక అధికారులకు సవాల్‌గా మారింది. వరద తగ్గి నీటిమట్టం తగ్గితే తప్ప స్టాప్ గేటును అమర్చే అవకాశాలు లేనట్లు చెబుతున్నారు.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Alert: బ్యాంకు ఖాతాదారులకి అలర్ట్.. మే 31లోపు ఈ పని చేయకపోతే 4 లక్షల...
29 May 2022 5:30 AM GMTఆకస్మికంగా తనిఖీ చేసిన టీటీటీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఆ...
29 May 2022 4:45 AM GMTప్రపంచంలోనే అతిపెద్ద మైదానంగా నరేంద్రమోదీ స్టేడియం పేరు...
29 May 2022 4:30 AM GMTరేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ - వైఎస్ షర్మిల
29 May 2022 4:15 AM GMTఏపీ సీఎస్ కు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ...
29 May 2022 3:55 AM GMT